సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బాధితులకు అందజేశారు. 4 గురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రు.1,99,070/- చెక్కులు అందించారు. పేద ప్రజల వైద్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి అవసరాలలో ఆదుకునే పెన్నిధిగా చెక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు.