జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీ..!
BHPL: వేసవికాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఒక్కో వ్యక్తికి 18 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1,38,747 రేషన్ కార్డులు ఉన్నాయి. యూనిట్ కుటుంబ సభ్యుల సంఖ్య 3,93,919గా ఉండగా, 76,54,566 కిలోల బియ్యం మంజూరు చేశారు.