విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన
JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో మెడికల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం పర్సనల్ పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.