'VRAల సమస్యలు పరిష్కరించాలి'
SKLM: వీఆర్ఎల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గువ్వాడ మదన్ మోహన్, శ్రీనివాసరావు లు డిమాండ్ చేశారు. సీఐటీయు రాష్ట్ర కమిటీ, రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపుమేరకు మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ అమలు చేయాలని తెలిపారు.