VIDEO: తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ
TPT: తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీప క్యూలైన్లలో ఇద్దరు భక్తులు ఘర్షణకు దిగిన ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భక్తులు ఓర్పుతో వ్యవహరిస్తూ క్యూలైన్ నియమాలను పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కోరింది.