భారీ వర్షం.. తెలుగులోనూ హైడ్రా అలర్ట్

HYD నగరం నుంచి ORR వరకు ప్రజలకు హైడ్రా అలర్ట్ మెసేజెస్ పంపుతుంది. మేడ్చల్, పటాన్‌చెరు, మియాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి ప్రాంతాలలో 15 సెం.మీ, మిగతా హైదరాబాద్‌లో 7-12 సెం.మీ. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని టీం నగర ప్రజలందరికీ అలర్ట్ మెసేజెస్ పంపింది. మొన్నటి వరకు ఇంగ్లీషులో పంపిన హైడ్రా, ఇప్పుడు తెలుగులోను హెచ్చరికలు పంపింది.