లారీ డ్రైవర్‌కు ఐదేళ్ల జైలు

లారీ డ్రైవర్‌కు ఐదేళ్ల జైలు

VSP: నిర్లక్ష్యంగా లారీ నడిపి ఒకరి మరణానికి కారణమైన డ్రైవర్‌కు గాజువాక ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు దాసరి బంగారు రెడ్డికి రూ.10 వేల జరిమానా కూడా విధించగా, చెల్లించకపోతే అదనంగా రెండు నెలల శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఎస్.కవిత ఆదేశించారు.