ఆ 20 మంది ప్రపంచ నేతల్లో మోదీ, పుతిన్ : చైనా

ఆగస్టు చివర్లో చైనాలో జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. SCO సదస్సుకు వస్తోన్న 20 మంది ప్రపంచ నేతల్లో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారని తాజాగా చైనా వెల్లడించింది. SCO చరిత్రలో ఇదే భారీ సమావేశంగా నిలుస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ల్యూ బిన్ వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు.