రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన అవసరం

BDK: రైతులు పంట పొలాల్లో పనిచేసే సమయంలో విద్యుత్ భద్రతా నియమాలను పాటించాలి అని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ జీవన్‌కుమార్ సూచించారు. పినపాక మండల కేంద్రంలో నిర్వహించిన రైతు పొలంబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర జాగ్రత్తలు తీసుకోవడం, లోపభూయిష్టమైన తీగలను తాకకూడదని రైతులకు సూచించారు.