రూ.40 కోట్ల పరిహార చెక్కులు పంపిణీ
CTR: రామకుప్పం మండలం కడిసినకుప్పం గ్రామంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన 73 మంది రైతులకు సుమారు ₹40 కోట్ల పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ముందుగా రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌తో కుప్పం ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.