రేపు కరెగుట్టలో పర్యటించనున్న డీజీపీ
MLG: జిల్లాలో మావోయిస్ట్‌ల ప్రధాన స్థావరమైన కరెగుట్టలలో రేపు DGP శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. కేంద్ర బలగాలు ముర్మూర్ బేస్ క్యాంప్ నుంచి తడపల వరకు నిర్మించిన 15 K.Mల రోడ్డును పరిశీలిస్తారు. ఆ తరువాత గుత్తికోయలతో కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాంలో పాల్గొని, వారి అభివృద్దిపై సమీక్షిస్తారు. ఆయనతో పాటు PCCF డా.సువర్ణ పాల్గొననుంది. ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.