‘డిండికి నీటి తరలింపుపై నోరు విప్పాలి'

NGKL: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల నుంచి డిండి, నల్గొండ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నీటిని తరలించే ప్రక్రియపై ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు విప్పాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం అప్పట్లోనే డిండి ప్రాంతానికి నీటి తరలింపు ప్రయత్నం చేశారని అన్నారు.