ఈనెల 28న అచ్చంపేటకు ఎమ్మెల్యే వంశీకృష్ణ రాక

ఈనెల 28న అచ్చంపేటకు ఎమ్మెల్యే వంశీకృష్ణ రాక

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈనెల 28న అచ్చంపేట పట్టణానికి రానున్నారు. నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందిన ఆయన తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. 28న పట్టణంలో జరిగే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఉమామహేశ్వర దేవస్థానంలో పూజలు నిర్వహిస్తారని శుక్రవారం తెలిపారు.