వైన్స్‌లో అక్రమ రవాణాపై అధికారుల నిర్లక్ష్యం: సాంబయ్య

జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల నిర్వాహాకుల అక్రమ దందాపై ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని బహుజన కులాల ఐక్య వేదిక వ్యవస్థాపకులు గుమ్మడిరాజుల సాంబయ్య ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వైన్స్ షాపులలో బీర్లు లేవని చెబుతూ బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.