విద్యార్థులను అభినందించిన కలెక్టర్
GDWL: అయిజ పట్టణానికి చెందిన విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాసిన 30 మంది విద్యార్థుల్లో ఏకంగా 16 మంది జాతీయ స్థాయి నవోదయ విద్యాలయాలకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బుధవారం గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.