'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

RR: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి 61 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలన్నారు.