పాకిస్తాన్ హెడ్ కోచ్‌పై వేటు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమితో PCB కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మహిళా జట్టు ప్రధాన కోచ్‌గా ముహమ్మద్ వసీంను తొలగించినట్లు ప్రకటించింది. కాగా, ఈ మెగాటోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవగా, 4 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.