ముంబై గాలి విషతుల్యం.. రోహిత్ భార్య ఆవేదన
ముంబైలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీనిపై టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిందని, ఆకాశం కూడా సరిగా కనిపించడం లేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలో AQI ప్రమాదకర స్థాయికి చేరింది. రితిక చేసిన పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా కాలుష్యంపై చర్చించుకుంటున్నారు.