రెండో విడత ల్యాండ్‌పూలింగ్‌కు రంగం సిద్ధం

రెండో విడత ల్యాండ్‌పూలింగ్‌కు రంగం సిద్ధం

AP: రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్‌పూలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు యండ్రాయి గ్రామస్తులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 16,666.56 ఎకరాలను సమీకరించనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ఇదివరకే మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.