గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు: జిల్లా కలెక్టర్

MLG: ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు 144 సెక్షన్ అమలు చేయాలని ములుగు కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అభ్యర్థుల కోసం తగినన్ని బస్సులు ఏర్పాటుచేయాలని టిజిఎస్ఆర్టీసీ ఎండీని కోరారు.