శ్రీ ఆంజనేయ స్వామికి విశేష పూజలు

శ్రీ ఆంజనేయ స్వామికి విశేష పూజలు

VZM: శ్రీరామస్వామి దేవస్థానం రామతీర్థంలో బుధవారం ముందుగా స్వామికి ప్రాతఃకాలార్చన, బాల భోగం చేశారు. అనంతరం ప్రతి సంవత్సరము మార్గశిర మాస శుద్ధ త్రయోదశి భరణి నక్షత్రం నాడు హనుమాన్ వ్రతము పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృతంతో అభిషేకము, తమలపాకు, సింధూరంతో సహస్రనామార్చనతో విశేషఅర్చనలు నిర్వహించారు. ఇందులో సహాయ కమిషనర్ వై. శ్రీనివాస్ పాల్గొన్నారు.