సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బారులు తీరిన జనాలు

సత్యసాయి: బుక్కపట్నం సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ల కోసం పేదలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం సర్వర్ మోరాయించడంతో సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ ఎదుట జనాలు క్యూ కట్టారు. దీంతో వృద్ధులు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచివున్నా రిజిస్ట్రేషన్లు జరగపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.