'యూరియా బస్తాలు ఇవ్వకుంటే నిరాహార దీక్ష'

MNCL: జన్నారం మండలంలోని చింతగూడ పిఎసిఎస్ పరిధిలో ఉన్న రైతులకు యూరియా బస్తాలు రాకుంటే నిరాహార దీక్ష చేస్తానని పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ కే.విజయ్ ధర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్, సింగరాయిపేట్ రైతులు మూడు రోజులుగా యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మంగళవారం తిమ్మాపూర్ రైతు వేదిక వద్ద నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.