మహిళా సాధికారతకు అనేక పథకాలు: పురందేశ్వరి

మహిళా సాధికారతకు అనేక పథకాలు: పురందేశ్వరి

AP: మహిళా సాధికారతకు అనేక పథకాలు తీసుకొచ్చామని ఎంపీ పురందేశ్వరి అన్నారు. బేటీ బచావో-బేటీ పడావో, మహిళా సమ్మాన్ నిధి సహా అనేక పథకాలు వచ్చాయని చెప్పారు. తిరుపతిలో జాతీయ తొలి మహిళా సాధికారత సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సామాజిక అడ్డంకులను అధిగమించి అనేక మంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. మహిళల ఆర్థిక, విద్య, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్నామని చెప్పారు.