VIDEO: వీఎంఆర్డీఏ నిధుల నుంచి అభివృద్ధి పనులు

VIDEO: వీఎంఆర్డీఏ నిధుల నుంచి అభివృద్ధి పనులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 27 వార్డులో ముమ్మురంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీఎంఆర్డీఏ నుంచి కేటాయించిన నిధులతో రోడ్డు నిర్మాణ పనులు సోమవారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న వార్డు ప్రజలు చేపట్టిన రోడ్డు నిర్మాణంతో సంతోషం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు కూడా రోడ్డుకు అనుసంధానంగా నిర్మించడంతో వర్షాకాలంలో ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.