జర్నలిస్టులకు క్రీడలు అవసరం
VSP: జర్నలిస్టులు నిత్యం ఒత్తిడిలో పనిచేస్తుంటారని, శారీరక ఆరోగ్యానికి క్రీడలు అవసరమని ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, విశాఖ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పితాని సూర్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం గాజువాక క్రికెట్ టీంకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. జర్నలిస్టుల్లో ఐక్యత పెరగడానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు.