VIDEO: రోడ్డు మరమ్మతులు చేయాలని సీపీఎం నిరసన

JGN: బచ్చన్నపేట మండలం కేశవరెడ్డిపల్లి గ్రామంలో బురదమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. రోడ్లు బురదమయమైనా అధికారులు స్పందించడం లేదని, చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలమయం అవుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు