గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. దంపతులకు గాయాలు
KMM: వైరా మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై శుక్రవారం జరిగిన బైకు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్లూరు మండలం బోడుమల్లె గ్రామానికి చెందిన బానోత్ భద్రు నాగమణి దంపతులు ఖమ్మం వెళ్తుండగా బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.108 ద్వారా గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.