వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం కరడ్‌పల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల రాకపోకలు,గన్నీ సంచుల లభ్యత, రవాణా సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.