మాచర్లలో జాబ్ మేళా వాయిదా
PLD: మాచర్ల డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న జరగాల్సిన జాబ్ మేళా వాయిదా పడింది. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ. తమ్మాజి రావు, కళాశాల ప్రిన్సిపల్ డా.జె. లక్ష్మికుమారి గురువారం తెలిపారు. జాబ్ మేళా తిరిగి ఈ నెల 27న అదే వేదికలో జరుగుతుందని వారు ప్రకటించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.