'రోడ్డు విస్తరణ పనులలో ఆలయంను కూల్చవద్దు'
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా అయ్యప్ప స్వామి ఆలయంను కూల్చవద్దని అయ్యప్ప స్వాములు మున్సిపల్ కమిషనర్ రమేష్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ముందుగా వారు అయ్యప్ప స్వామి ఆలయం నుండి కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. స్పందించిన కమిషనర్ ఉన్నతాధికారుల ద్రుష్టికి సమస్య తీసుకెళ్తానని పేర్కొన్నారు.