విద్యార్థికి కలెక్టర్ ప్రత్యేక అభినందన

విద్యార్థికి కలెక్టర్ ప్రత్యేక అభినందన

NDL: పదవ తరగతి ఫలితాల్లో 600కు 597 మార్కులు సాధించిన నంద్యాల శ్రీ గురురాజా పాఠశాల విద్యార్థి వైవిఎస్ నర్సిరెడ్డిని శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి డీఈవో జనార్ధన్ రెడ్డితో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఫలితాల స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అలాగే డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డిని కలెక్టర్ అభినందించారు.