VIDEO: 'భారీ వర్షాలు.. అన్నదాతకు తీరని నష్టం'

ADB: తాంసి మండలంలోని కప్పర్ల, జామిడి, బండల నాగపూర్ తో పాటు పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, సోయా, తొగరి పంటలు పూర్తిగా నీటిలో మునిగి తీవ్ర నష్టం జరిగినట్లు రైతులు వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు.