VIDEO: కెనాల్ సర్వేపై ఉద్రిక్తత.. రాస్తారోకో, అరెస్ట్‌లు
MHBD: గార్ల మండలం దుబ్బగూడెంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తూ పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.