భారత విదేశాంగ విధానంపై జైశంకర్ క్లారిటీ
రాయ్‌పూర్ IIM 15వ స్నాతకోత్సవంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడు దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడంపై దృష్టి సారించిందని ఆయన అన్నారు. వనరులు, సాంకేతికతను సమకూర్చుకోవడంతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, 'బ్రాండ్ ఇండియా'ను ప్రమోట్ చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.