ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: పోలాకి మండలం కుసుమపోలవలసకి చెందిన మణికంఠ, శ్రీనివాసరావులు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమణమూర్తి శుక్రవారం సాయంత్రం వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.