తణుకులో వీధి కుక్కల బెడద
W.G: తణుకులో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉండ్రాజవరం జంక్షన్ వద్ద అధిక సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైరవిహారం చేశాయని వాపోయారు. వీటితో విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు ఈ సమస్యపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.