అటువంటి నెంబర్ ప్లేట్లపై ఫైన్ వేయాల్సిందే: RRR
W.G: భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(RRR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై వీధి, తాలూకా సంస్కృతులను చాటేలా రాసుకోవడం తగదని, అటువంటి వారిపై కఠినంగా జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు. నిబంధనల అతిక్రమణపై ఉక్కుపాదం మోపాలని, రోడ్డు క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని ఆయన తెలిపారు.