నేడు అనంతలో 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్

నేడు అనంతలో 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్

VZM: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' విజయోత్సవ సభ నేడు అనంతపురంలో నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న ఈ సభకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతలో నిర్వహించాలని అనుకున్నా.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేశారు.