VIDEO: శ్రీ దుర్గా భవాని మాత బండ్ల ఊరేగింపు
MDK: పెద్ద శంకరంపేట శ్రీ దుర్గాభవాని ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎద్దుల బండ్లకు వివిధ రకాల చీరలు, రవికలు, మామిడి కొమ్మలు, వేపాకులు, పూలు, కాషాయ జెండాలు కట్టి సుందరంగా అలంకరించారు. పట్టణ పురవీధుల గుండా ఎద్దుల బండ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.