లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి: దుర్గు పటేల్
ADB: చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాల సమన్వయకర్త మెస్రం దుర్గు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ 23న ఉట్నూరులోని MPDO కార్యాలయ ప్రాంగణంలో 'ధర్మ యుద్ధం' పేరుతో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా ఆదివాసీలు హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.