ANU డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూన్, జులై నెలలో నిర్వహించిన డిగ్రీ 5వ, 6వ సెమిస్టర్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని శుక్రవారం యూనివర్సిటీ వీసీ కె. గంగాధర్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5, 454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 4, 292 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.