డీఎస్పీకి ఆలయ ప్రతిష్ఠ ఆహ్వానం
NDL: డోన్ డీఎస్పీ శ్రీనివాసులను ఆలయ కమిటీ పెద్దలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అవుకు(మం) చెర్లోపల్లిలో నూతనంగా నిర్మించిన ఉమ భోగేశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 31 నుంచి జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి కోరారు.