PSను ఆకస్మికంగా సందర్శించిన DSP

VZM: చీపురుపల్లి DSP రాఘవులు శుక్రవారం వంగర PSను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పొలీస్ స్టషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.