VIDEO: బంగారు కుటుంబాలకు 'మార్గదర్శి' గా కమిషనర్

VIDEO: బంగారు కుటుంబాలకు 'మార్గదర్శి' గా కమిషనర్

TPT: పీ4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. నిరుపేదలైన ఏడు కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి వివరాలు తెలుసుకుని చలించిపోయారు. నగరంలోని పేదలను ఏదో విధంగా సాయం చేసేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.