ఆత్మకూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

NDL: ఆత్మకూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపీ రషీద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో ఇస్లాం పేటలో ఉన్న బోరుకు పూజ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా ఆరు బోర్ల ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.