రైలు కిందపడి వ్యక్తిమృతి
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం వెంకటరాజుపల్లె సమీపంలో శనివారం ఉదయం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్నరేణిగుంట హెడ్ కానిస్టేబుల్ కోదండం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించార. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.