VIDEO: ధర్మ యుద్ధం సభ...పెద్ద సంఖ్యలో ఆదివాసీలు
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడవో గ్రౌండ్‌లో జరుగుతున్న ఆదివాసీల ధర్మ యుద్ధం మహాసభకు ఆదివాసీ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి జిల్లలోని అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల నిర్మల్ జిల్లాల నుంచి ఆదివాసీ 9 తెగల సంఘాలు, అనుబంధ సంఘాలు, నాయకులు తుడుం దెబ్బ వాయిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.