'వేతనాలు చెల్లించకపోతే సమ్మె తప్పదు'
SKLM: రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ వేతనాలు చెల్లించడం లేదన్నారు.