సాయిరాం మృతికి కారణం అతడే: ASP

సాయిరాం మృతికి కారణం అతడే: ASP

NRML: మామడ మండలంలో సాయిరాం అనే వ్యక్తి మృతికి కారణం ట్రాక్టర్ నడిపిన ఒక మైనర్ అని నిర్మల్ ASP సాయి కిరణ్ స్పష్టతనిచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన మైనర్‌ను గుర్తించామన్నారు. వెంటనే ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని మైనర్‌తో పాటు వాహన యజమాని ఆలకుంట రాముపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయాన్నారు.